గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Spread the love

గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ లక్ష్యం

తొలిపొద్దు పర్యటనలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్

గ్రామాల అభివృద్దే బీ.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ మరియు మానకొండూర్ శాసన సభ్యులు
డా.రసమయి బాలకిషన్ వివరించారు

ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఆయన తొలిపొద్దు పర్యటనలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. అనంతరం వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు

రసమయి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పల్లె ప‌ల్లెనా అభివృద్ది జరుగుతుందని,స‌మైక్య పాల‌న‌లో అన్నీ స‌మ‌స్య‌లేనని తాగునీరు, సాగునీటికి దూరం చేశారని అన్నారు

క‌రంటు లేక గ్రామాలు విల‌విలలాడాయని తెలంగాణ ప్ర‌భుత్వంలో 24 గంట‌ల క‌రంటు మిష‌న్ భ‌గీర‌థ‌తో తాగు నీరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు పూర్తి చేసిందన్నారు. నాడు వ‌ల‌సెల్లిన ప‌ల్లెలు ఇప్పుడు క‌ళ‌క‌ళ‌ లాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు

తెలంగాణకు సీయం కేసీఆర్ పాల‌నే శ్రీ‌రామ‌ర‌క్ష అని కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. గ్రామాలలో ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు

మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల (స్మశాన వాటికలు) నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రసమయి కోరారు..

Related Posts

You cannot copy content of this page