జగ్గయ్యపేట నియోజకవర్గన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు.
జగ్గయ్యపేట పట్టణం,చెరువు బజార్ నందు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఉరచెరువు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఊర చెరువు అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.ఉదయాన్నే వాకింగ్ చేసే వారి సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బందులు లేనివిధంగా సువిశాలంగా వాకింగ్ ట్రాక్ నిర్మించాలని సూచించారు.చెరువు అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.ఇప్పటికే చెరువు చుట్టూతా ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చెయ్యడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తన్నీరు నాగేంద్ర,వేముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.