రమజాన్ మాసం వరాల వసంతం అబ్దుల్ మలిక్

Spread the love

పవిత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన మాసం శుభాల సిరులు వర్షంచే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిము దివ్య ఖుర్ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే రోజా వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ ఉంది. ఈ మాసంలో చేసే ఒక్క సత్కార్యానికి అనేక రెట్లు అధికంగా పుణ్యఫలం లభిస్తుంది. ఒక విధిని ఆచరిస్తే డెబ్బై విధులు ఆచరించిన దానితో సమానమైన పుణ్యం లభిస్తుంది. సమాజంలో మంచి మార్పు కనిపిస్తుంది. ‘ఫిత్రా’ ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి. ఫిత్రా అన్నది పేదసాదల హక్కు, ఫిత్రాల వల్ల వారికి ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. జకాత్ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ‘తరావీహ్’ నమాజులు కూడా ఈ మాసంలోనే ఆచరించబడ తాయి. అదనపు పుణ్యాలు మూటగట్టుకోవడానికి ఇదొక సువర్ణా వకాశం. ఈ పవిత్ర మాసంలో ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాన్ రోజాలు పాటిస్తారో వారు గతంలో చేసిన పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు. సహనం వహించవలసిన నెల రమజాన్,


రమజాన్ మాసం సహనం, నిగ్రహం పాటించవలసిన నెల, సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇది సమాజంలోని ఉపేక్షితుల పట్ల, బాధితుల పట్ల సానుభూతిని చూపించాల్సిన నెల. శారీరక సాధనాలు, ఆరాధనలు, ఉపవాసనలు, గ్రంథ పారాయణాలు మనిషి అంతర్యంలో పరివర్తన తెస్తాయి. మనిషి ఆలోచనా తీరు మారుతుంది. ఉన్నత ప్రమాణాలు అలవడతాయి. ఫలితంగా మునిషి ప్రవర్తనలలో నైతికత, మంచితనం, ప్రశాంతత, నిష్టా గరిష్టత, పదాచారం చోటుచేసుకుంటాయి.
మనిషి ఆధ్యాత్మికతకు, సర్వతోముఖాభివృద్ధికి, మనోవికాసానికి రమజాన్ దారి చూపిస్తుంది. ఇది విశ్వప్రభువు సందేశమైన దివ్య ఖుర్ఆన్ ను మానవాళికి ఈ మాసంలోనే అందించింది. ఈ అంతిను దివ్య ఖుర్ఆన్ ఆవతరం సాధారణ విషయం కాదు. అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న ఆనాటి అరబ్బులను విజ్ఞాన పథంలోకి మార్చి, వారిని విద్యా పోషకులుగా, క్రమశిక్షణా దురం ధరులుగా సంస్కారవంతులుగా చేసింది. బాధితులు, అణగారిన వారి కోసం, పోరాడే వారిగా మనుమల్ని తీర్చిదిద్దింది. పవిత్ర ఖుర్ఆన్ అవసరార్థుల కోసం, ప్రేరణాత్మక, విప్లవాత్మకమైన జీవన విధానాన్ని, నిరాడంబరమైన నైతిక జీవితాన్ని ప్రపంచానికి అందించింది.
సౌమ్ అంటే ఉపవాసం
ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’ అంటారు. దీని అర్ధం ‘ఆగి పోవడం’, ‘నియంత్రించుకోవడం’. ఈ నెలలో ఆహారపదార్థాలను కొంచెం దూరంగా ఉండటమే కాదు. తమను తాము చెడు నుంచి కూడా దూరంగా ఉంటారు.
ఫిత్రా నిరుపేదల హక్కు


ఫిత్రా దానం పేదల పాలిట పెన్నిది. వారు పండుగ పూట పస్తు లుండకుండా అందరితో పాటు వారు కూడా సంతోషంగా పండుగ పూట గడిపేందుకు దైవం దీన్ని విధిగా చేశాడు. ఫిత్రా దానం వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి విశ్వాసి మాత్రం ఫిత్రా చెల్లించి తన ఆనందాన్ని ప్రకటిస్తూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. రెండు, ఉపవాసస్థితిలో జరిగిన పొరపాట్లు ఫిత్రా చెల్లించడం వల్ల దూరమవుతాయి, మూడు, ఇది నిరుపేదల ఇళ్ళల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది. వారు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఉపయోగపడుతుంది.
అసమానతలను తొలగించే సాధనం జకాత్
జకాత్ అన్న పదం ‘జకీ’ నుంచి వచ్చింది. జక అంటే అర్ధం పెరుగుట, ఎదుగుట, వృద్ధి చెందుట, అభివృద్ధి, వ్యాపించుటం మొదలైనవి. జకాత్ అంటే ప్రతి ధనవంతుడు తన ధనం నుండి కొంత ధనాన్ని అవసరమైన వారికి ఇవ్వడం. నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనంనుండి నిర్ణీత ప్రజల కొరకు ఇచ్చే ధనమే జకాత్
తరావీహ్ నమాజ్


రమజాన్ నెలలోని తరావీహ్ నమాజు పుణ్యం రీత్యా ఎంతో ఘనమయిన నమాజు. దాన్ని నెరవేర్చమని హదీసుల్లో తాకీదు చేయబడింది. అయినప్పటికీ అది నఫిల్ నమాజు మాత్రమే. ఈ నఫిల్ నమాజును రమజాన్ నమాజుగా పేర్కొనటం జరిగింది. కాని తర్వాతి కాలంలో ఇది ‘తరావీహ్ నమాజ్’గా నామాంతరం జరిగింది. తరావీహ్ అనేది తర్వీహ్ అనే పదానికి బహు వచనం. తరావీహ్ అంటే విశ్రాంతి, విరామం అని అర్థం. మహాప్రవక్త(స) అనుచరులు ఆయన సంప్రదాయానుసారం చాలాసేపు నిలబడి నమాజు చేసేవారు. ఆ విధంగా నాలుగు రకాతుల తరువాత కాసేపు విశ్రాంతి తీసుకునేవారు.
ఎవరయితే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలా పేక్షతో తరావీహ్ నమాజ్ చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరా ధాలను అల్లాహ్ క్షమిస్తాడు. (ముత్తపకున్ అలైహి)
దైవప్రవక్త(స)రమజాన్ మాసం చివరి పదిరోజులు ఏతెకాఫ్ చేసే వారని అబ్దుల్లా బిన్ ఉమర్(ర) తెలిపారు. (బుఖారీ, ముస్లిమ్)
హజ్రత్ ఆయిషా (రజి) ఇలా ఉల్లేఖించారు: దైవ సందేశహరులు (స) రమజాన్ చివరి పది రోజులు రాగానే రాత్రిళ్ళు ఇతోధికంగా జాగరణ చేసి దైవారాధనలో గడిపేవారు. తన సతీమణుల్ని కూడా మేల్కొలిపేవారు. అధికోత్సహంతో దైవారాధనలో నిమగ్నులయ్యే వారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page