SAKSHITHA NEWS

The minister invited in a party scarf

బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి


సాక్షిత : మునుగోడు:మునుగోడు నియోజకవర్గము నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో ప్రజలు టి ఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, అవగాహనతో ముందుకెళ్తున్నారు.

బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మంత్రి సబితా రెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ లో చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి టి ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ తప్పకుండా గెలుపు సాధిస్తుందని అన్నారు.

ప్రచారం లో భాగంగా వెళ్తున్నపుడు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని,ప్రతి ఇంటా టి ఆర్ ఎస్ పథకాలు అందాయని,ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటామని ఓటర్లు పేర్కొంటున్నారని అన్నారు.ధరలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురవుతున్న బీజేపీకి తెలంగాణ రాష్ట్రం లో స్థానం లేదన్నారు.టి ఆర్ ఎస్ ను ప్రజలు ఇంటి పార్టీగా ఆధరిస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో టి ఆర్ ఎస్,వామపక్షాలు బలపర్చిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.మునుగోడు లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఓటర్లను అభ్యర్తించారు.


SAKSHITHA NEWS