రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడం జరుగుతుందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచన ధోరణితో వీటిని పారదర్శకంగా కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
*మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల సంబంధించి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులకు 1,000 కి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
ఆధ్వర్యంలో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు 500 చొప్పున 1000 మందికి అలాట్మెంట్ సర్టిఫికెట్లను సైతం అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల సాకారం చేయాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అన్ని వసతులతో కట్టించి పంపిణీ చేయడం జరుగుతుందని ఇలాంటివి దేశంలో ఎక్కడ కూడా చేపట్టలేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కల నిజమైందని ఎంతో గొప్ప రోజు అని అన్నారు. అలాగే అర్హులైన పేదవారికి ఎలాంటి పైరవీలు, తదితరాలు లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించడం జరుగుతుందని దీనికి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగిందని దీనివల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనర్హులకు ఇళ్ళ కేటాయింపులు జరగకుండా అర్హులకు మాత్రమే ఇళ్ళు వచ్చేలా రూపొందించారని ఇది ఎంతో గొప్ప విషయమని మంత్రి మల్లారెడ్డి వివరించారు.
దీనివల్ల పైరవీలు, రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారిఇ ఇళ్ళ కేటాయింపు జరుగుతుందని తెలిపారు. 2 నియోజకవర్గాల్లో మొదటి విడతలో 1000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దీంతో పాటు అర్హులైన మిగిలిన లబ్ధిదారులకు మూడో, నాలుగవ దశల్లో డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరుగుతుంని ఇది నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు అందచేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.