ఓట్ల తొలగింపు పట్ల టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: టీడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలోని కార్యాలయం నందు సవితమ్మ మాట్లాడుతూరాష్ట్రంలో ప్రజా హక్కులను వైసిపి ప్రభుత్వం హరిస్తోందని
ఓటు అనేది ప్రజల ప్రాథమిక హక్కు, కనీసం దాన్ని కూడా సద్వినియోగం చేసుకోనీయకుండా అక్రమంగా వైసీపీ నాయకులు ఓట్లు తొలగిస్తున్నారని తప్పుడు హామీలతో దొంగ ఓట్లతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసిపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్రకు వైసిపి తెరలేపిందన్నారు.
కేవలం ప్రతిపక్ష పార్టీలే ధ్యేయంగా చేసుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించుకుని స్థానిక వైసిపి నాయకులతో ఓట్లను తీసివేసే విధంగా కుట్రలు పన్నుతున్నారు.
కావున టీడిపి శ్రేణులు ప్రతి ఒక్కరూ తమ వార్డుల్లో వారి ఓట్లతో పాటుగా టిడిపి సానుభూతిపరులు ఓట్లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని, చనిపోయిన వారి ఓట్లు, మీకు సంబంధం లేని వాళ్ళు మీ డోర్ నంబరు ఆధారంగా ఓట్లు నమోదు చేసుకున్నారో లేదో సద్వినియోగం చేసుకొని కొత్త ఓట్లతో పాటుగా డోర్ నంబర్లు, చిరునామాలు మార్చు కొనే విదంగా అడుగులు వేయాలని తెలియ చేసిన సవితమ్మ .ఈ కార్యక్రమంలోసీనియర్ టీడీపీ నాయకులు మాధవ నాయుడు, మాజీ జడ్పీటీసీ వెంకట రమణ,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు DV ఆంజనేయులు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, SC సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్,మాగే చెరువు సర్పంచ్ నరసింహులు, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి,ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజూనాథ్,మద్దిలేటి,బాబు రాము, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు….