The Kumram Bheem ceremony was held at the Asifabad district collector’s office
సాక్షిత : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కోనేరు కోనప్ప , కలెక్టర్ రాహుల్ రాజ్ PS. , అడిషనల్ కలెక్టర్ రాజేశం ,అడిషనల్ కలెక్టర్ శ్రీమతి ఛాథ్ బాజ్ పేయ్ , SP సురేష్ కుమార్ , అడిషనల్ SP అచ్చెశ్వరరావు , మరియు జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలు, విద్యార్థులు,పాత్రికేయ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ గాంధీ మాట్లాడుతూ
1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా పౌరులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు,విద్యార్థిని, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మన కుమురం భీం జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయి జాతీయ సమైక్య స్పూర్తికి నిలువుటద్దంగా నిలవాలని ఆకాంక్షించి దాని కొరకు ప్రాణాలు త్యాగం చేసిన మహానీయులందరికి నివాళులు అర్పిస్తున్నాను. అదే విధంగా ఆదివాసుల హక్కుల గురించి తపించి వారిలో జల్, జంగిల్, జమీన్ అనే నినాదం తో స్పూర్తి నింపిన మన జిల్లా ముద్దు బిడ్డ కుమురం భీం కు నివాళులు అర్పిస్తున్నాను.
గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల ను గిరి గుడాలకు,పల్లెలకు అందించడం జరుగుచున్నది. ఏండ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న అర్హులైన గిరిజనుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఆదివాసి గిరిజన సమ్మేళనం తో పాటు కుమురం భీం ఆదివాసి భవన్, సేవలాల్ బంజారా భవన్ లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటున్నాము. గిరిజన సంక్షేమ శాఖ ద్వార గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలతో పాటు ప్రీ మెట్రిక్. పోస్ట్ మెట్రిక్ వారికీ ఉపకార వేతనాలతో పాటు సన్న బియ్యం తో నాణ్యమైన భోజనం, విద్య , మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నాము.
దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన దళిత బంధు పథకం ద్వార మన జిల్లాలో సుమారుగా 177 మంది లబ్దిదారులకు 17 కోట్ల 70 లక్షలతో దళిత బంధు పథకం అమలు చేయడం జరుగుతున్నది.
అదే విధంగా వెనక బడిన కులాల అభివృద్ధి కొరకు, గొల్ల, కురుమ వారికి గొర్రెల పంపిణి కార్యక్రమం, మత్స్య కారుల కోసం చేప పిల్లల పంపిణి, నాయి బ్రాహ్మణ మరియు రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా మరియు నిరుపేద బి.సి. విద్యార్థుల కొరకు బి.సి. వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది.
జిల్లాలో రైతు బంధు, రైతు భీమ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ఆసరా, వితంతు, వికలాంగుల పించన్ లు పంపిణి చేస్తున్నాము.
కొత్తగా 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు కూడా వృద్ధాప్య పించను అమలు చేస్తున్నాము.