జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం.
జర్నలిస్టులు తరుపున అధికారులని నిలదీసిన కొల్లు రవీంద్ర.
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లా కమిటీ (సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా సంతకం చేసిన తీర్మాన) కాపీ చించి చెత్తబుట్టలో వేసిన వైనం.
కృష్ణాజిల్లాలో జర్నలిస్టులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఇళ్ళ పట్టాల తీర్మానం కాపీలు ఈరోజు చెత్తబుట్టలో దర్శనం ఇచ్చాయి.
స్థానిక ఎమ్మెల్యేకి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ససేమిరా ఇష్టం లేదు అని ఈ ఘటన ద్వారా స్పష్టం అవుతుందిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వాపోయారు.
ఈ ఘటనపై స్పందించిన కొల్లు రవీంద్ర నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి I&PR DDని కలిసి ఈ ఘటనపైన అరా తీశారు.
విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ డీడీని కోరారు.
ఈ ఘటన ద్వారా అయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు నాయకులు కళ్ళు తెరవాలి..
జర్నలిస్టుల న్యాయమైన కోర్కెల కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జర్నలిస్టులకు సంబందించిన ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఒరిజినల్ కాగితాలు నేడు చెత్తబుట్టలో దర్శనం ఇచ్చాయి. కృష్ణాజిల్లా జర్నలిస్టుల ఇళ్లస్థలాల కమిటి సభ్యులుగా వ్యవహరించిన ఇంచార్జ్ మంత్రి ఆర్.కే. రోజా (చైర్మన్), జిల్లా కలెక్టర్ మెంబర్ (సంతకం చేయలేదు), డి.ఆర్.ఓ కృష్ణా(మెంబెర్), శేషుబాబు (మెంబర్), కె.గణేష్ (మెంబర్), కె.సతీష్ (మెంబర్), ఆర్.డి.ఓ ఉయ్యూరు (మెంబర్), ఆర్.డి.ఓ గుడివాడ (మెంబర్), ఆర్.డి.ఓ మచిలీపట్టణం (మెంబర్), డివిజనల్ పి.ఆర్.ఓ కృష్ణా (కన్వినర్) ల సంతకాలతో కూడిన కాగితాలు సైతం చెత్తలో దర్శనం ఇచ్చాయి.
ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు.
ఉత్తుత్తి హామీలతో కాలయాపన చేసి జర్నలిస్టులను దగా చేసి చివరకు చెత్తలో విసిరేశారు.
ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కొల్లు రవీంద్ర
లేనిపక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు నివేశన స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని నిర్మిస్తామని కొల్లు రవీంద్ర జర్నలిస్టులకు హామీ ఇచ్చారు..