మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Spread the love

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
కల్వకుర్తి మండలం జిడిపల్లి గ్రామానికి చెందిన దండు నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నాగయ్య అనే రైతు గ్రామానికి చెందిన తనకు చెందిన 3 ఎకరాల భూమిలో కెఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు వస్తుందనీ వరి పంట సాగు చేయడం జరిగింది. సాగునీరు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఈ సంఘటనకు స్థానిక శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించి ప్రభుత్వం ద్వారా 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఇంకా అనేక గ్రామాలలో రైతులు పంటలకు నీరు వస్తుందని ఆశతో పంటలు పండించడం జరుగుతుందని అధికారులు నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయి అనేక మంది రైతులు కన్నీరు మున్నీరవుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పంటలకు సరిపడే సాగునీరు ఇవ్వాలని లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ బిజెపి పట్టణ అధ్యక్షులు నరసింహ. సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్. గోరటి నరసింహ. బీజేవైఎం నాయకులు పరశురాములు, సంపతి శేఖర్ రెడ్డి, పానుగంటి శివ, శివాజీ,లాల్లు యాదవ్,శ్రీకాంత్ యాదవ్,నాపా శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page