డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
నాలుగు రోజులు క్రింద
కలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు, వీధిలో పడ్డాయని, ప్రభుత్వం వెంటనే అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించి, ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ల సమక్షంలో పత్రిక విలేకరుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ
నాలుగు రోజుల క్రిందట తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో కేవలం గొర్రెల పెంపకం వృత్తిపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయని, పది రోజుల కింద పెసర చేనుకు కలుపు మందు కొట్టిన సంగతి తెలియక గొర్రెల మేయడం వలన 200 గొర్రెలు మృత్యువాత పడి, 300 గొర్రెలు అస్వస్థకు గురయ్యాయని, ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి,రాష్ట్ర డిప్యూటీ సి ఎం మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల దృష్టికి తీసుకువెళ్లి పరిహారం వచ్చే విధంగా ఒత్తిడి తీసుకువచ్చి గొర్రెలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని మల్లి బాబు యాదవ్ హామీ ఇచ్చారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి గొర్రెకు ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించే వారిని, ఆ పథకం అమల్లో ఉన్నట్లయితే గొర్రెల పెంపకం దారుల జీవితాల్లో వెలుగులుగా ఉండేవని, ఆ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించి ప్రతి గొర్రెకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని మల్లిబాబు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్లు జనగం కోటేశ్వరరావు, అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, నూకల సైదులు, చల్లగుండ కృష్ణయ్య, నిమ్మల పుల్లారావు, బోబోలా లక్ష్మణరావు, పుల్లారావు, కోరం జానకిరామ్ పాల్గొన్నారు