సాక్షిత : *రూ.40 లక్షలతో చేపడుతున్న కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. 250 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల కొరకు చేస్తుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవ రావు, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, నాయకుడు ఆబిడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు ఏ.రేణయ్య నాయి, ప్రధాన కార్యదర్శి కే.పరమేష్ నాయి, చైర్మన్ ఎస్.రవిబాబు నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయి, బి.శ్రీనివాస్, గౌరవ అధ్యక్షడు మైలారం యాదగిరి నాయి, గంగుల శ్రీనివాస్ నాయి, క్యాషియర్ వి.మహేందర్ నాయి, మాజీ అధ్యక్షుడు వెంకటేష్ నాయి, మీడియా ప్రచార కార్యదర్శి బంటు ప్రవీణ్ నాయి, సలహాదారులు ఎం.బిక్షపతి నాయి, ఉపాధ్యక్షుడు ఎస్ఎంఎస్ సురేష్ నాయి, ఎం.కుమార్ నాయి మరియు నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.
నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…