స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రమాదంలో మృతి

Spread the love

సాక్షిత : స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత నెల 16 వ తేదీన సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 6 గురు మరణించారు. మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రభుత్వం తరపున అందజేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో 6 గురు మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ, నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా వారిని ఓదార్చి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. మృతులు అంతా ఎంతో భవిష్యత్ ఉన్న చిన్న వయసు పిల్లలు అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని వారికి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ RDO వసంత, తహసిల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page