పండితాపురం లో జాతర కార్యక్రమం నేటితో ముగింపు

Spread the love

పండితాపురం లో జాతర కార్యక్రమం నేటితో ముగింపు

-ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బోడెపుడి విఠల్ రావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

పండితాపురంలో ఈనెల 19 నుండి 22 వరకు జరిగిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర కళ్యాణం ఉత్సవాలు మరియు జాతర కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సీనియర్ న్యాయవాది బోడెపూడి విఠల్ రావు నేతృత్వంలో కొమ్మినేపల్లి కొండాయిగూడెం, పండితాపురం భక్త బృందం సహకారంతో ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. మొదటిరోజు తోరణాలంకరణ దేవుని పెండ్లి కుమారుని చేయుట విశ్వక్సేన పూజ, రెండవ రోజు అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం, మూడవరోజు గ్రామంలో భారీ ఎత్తున దేవుని ఊరేగింపు కార్యక్రమం, నాలుగవ రోజు వేదమంత్రాలు మధ్య అగ్నిదేవుని ఆవాహన చేసి, మహా పూర్ణాహుతి కార్యక్రమం చేసి, ఉత్సవాలు ముగిసినట్లుగా ప్రకటించడం జరిగింది. తదనంతరం వసంత పంచమి వేడుకలుగా భక్తజనాలు రంగులు చల్లుకుని పులకించిపోయారు. ఈ నాలుగు రోజులపాటు ఎంతో క్రమశిక్షణతో కళ్యాణోత్సవము మరియు జాతర కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని మల్లి బాబు యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, మేకల మల్లికార్జునరావు, మేకపోతుల మహేష్,భూక్యా నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, మేకల లక్ష్మీనారాయణ తొండల ముత్తయ్య జలగం శ్రీను జక్కంపూడి వెంకటేశ్వర్లు తోటకూర భద్రయ్య, జన్నారపు లింగయ్య, బండి లక్ష్మీ నర్సు, బండి ఎల్లయ్య బద్దల శేఖర్ డేరంగుల తిరుపయ్య, బత్తుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page