చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ ఎదురుగా తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి , GHMC మరియు జలమండలి అధికారుల తో కలిసి కాలనీ లో పర్యటించి, పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీ నుండి వచ్చే మురుగు నీరు ను నాలలోకి లింక్ కల్పకుండా సరైన ఔట్ లెట్ లేకుండా కాలనీ విధుల్లోకి వదలడం ఏ మాత్రం భావ్యం కాదని, నాల లోకి కలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగినది. మురుగు నీరు కాలనీ పరిసర ప్రాంతాల్లో చేరడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ,రోడ్లన్నీ మురుగు మయం అవుతున్నాయి అని, కాలనీ వాసుల విజ్ఞప్తి మెరకు ఈ రోజు కాలనీ లో పర్యటించడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన నాలలోకి కలిపే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడలని అధికారులను ఆదేశించడం జరిగినది ,అదేవిధంగా కాలనీ లో ప్రజల సౌకర్యార్థం త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని,కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE దుర్గాప్రసాద్, AE సంతోష్ రెడ్డి మరియు జలమండలి అధికారులు మేనేజర్ సుబ్రహ్మణ్యం మరియు చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కౌన్సిలర్ రాజు, బుచ్చిరెడ్డి, మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి ,నాగరాజు ,నరేందర్ బల్లా మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.