SAKSHITHA NEWS

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ఐడిఓ సి కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటన విలువరించిన దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.

నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని 10వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని 13న స్క్రోటి ని జరుగుతుందని ,15న విత్డ్రా చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు జరుగు తాయని,డిసెంబర్ 3న ఫలితాలు వెలువడడంతో డిసెంబర్ 5న ఎన్నికలు సమాప్తం అవుతాయని అన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 4,89,945 మంది కాగా 18-19 యువ ఓటర్లు 21,711 సీనియర్ సిటిజన్లో 3,617 కాగా పిడబ్ల్యూ డి ఓట్లు 9914 ఉన్నాయన్నారు.

పి డబ్ల్యు డి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసామని, జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అభ్యర్థులు ముందుగా ప్రకటనలు ఇస్తే ఎం సి ఎం సి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు ముందస్తుగా వారి ఓటును ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు. ఓటును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వారికి ఇష్టం వచ్చినవారికి ఓటు వేయాలన్నారు. జిల్లా లో ఎలాంటి సంఘటనలు జరుగకుండా సజావుగా నిర్వహించించేందుకు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS