రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ నిధులతో కల్లూరు మేజర్ గ్రామపంచాయితీలో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ నిధులతో కల్లూరు మేజర్ గ్రామపంచాయితీలో చేపట్టనున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కల్లూరు మేజర్ గ్రామపంచాయితీకి మంజూరైన 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాల ప్రతిపాదనలను గురువారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పరిశీలించారు. కల్లూరు మండల కేంద్రంలో వెజ్ అండ్ నాన్`వెజ్ మార్కెట్ ఏర్పాటు, పార్క్, ఓపెన్ జిమ్, సి.సి రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజి, గ్రంధాలయం ఏర్పాటు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని శాసనసభ్యులు కలెక్టర్‌కు వివరించారు. అట్టి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కల్లూరులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి సత్తుపల్లి శాసనసభ్యులు సమస్యను వివరించగా ప్రస్తుతం ఉన్న విగ్రాహాన్ని తీయించి కల్లూరు ప్రధాన సెంటర్‌లో డా॥బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని త్వరిత గతిన ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.