ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన, ప్రహారీ గోడ భద్రత అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా నిర్వహణ విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి, లోనికి అనుమతించాలని, సెల్ ఫోన్ ను అనుమతించకూడదని కలెక్టర్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ , అధికారులు తదితరులు ఉన్నారు.
ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…