The Deputy Speaker distributed the checks door to door
ఇంటింటికీ తిరుగుతూ చెక్కులను పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్
సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తార్నాక, అడ్డగుట్ట డివిజనల పరిధులలో ఇంటింటికీ తురుగుతూ లబ్దిదారుల ఇళ్ళ వద్దే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందచేశారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అడ్డగుట్ట కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ లతో పాటు బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, బీ ఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, లింగాని శ్రీనివాస్, అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తార్నాక డివిజన్ పరిధిలో బిగ్ బజార్, చింతల్, లాలాపేట, వినోభా నగర్, లక్ష్మి నగర్, సిరిపురి కాలని, అడ్డగుట్ట డివిజన్ పరిధిలో శాంతి నగర్, ఇందిరానగర్ కాలని, తుకారాం గేటు, అడ్డగుట్ట సీ సెక్షన్, డీ సెక్షన్ తదితర ప్రాంతాల్లో పద్మారావు ఈ సందర్భంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చింతల్ నాలా పై రూ.72 లక్షల ఖర్చుతో స్లాబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. అడ్డగుట్ట లో కొత్తగా నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను ఈ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పరిశీలించారు.
రూ.2.25 కోట్ల ఖర్చ్తుతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ పేదలకు ఉప కరిన్చేలా తీర్చి దిద్దలాని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అడ్డగుట్ట లో రెండు గుళ్ళ బస్తీ ప్రాంతంలో మంచి నీటి ఎద్దడి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు