హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్యెంటి కాలనీ లో 35.00 లక్షల రూపాయల అంచనా వ్యయం

Spread the love

35.00 Lakhs in Henti Colony under Hyder Nagar Division at an estimated cost of Rs

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్యెంటి కాలనీ లో 35.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపదుతున్న సి సి రోడ్ నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వారితో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అన్ని కాలనీ లలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శ్రీనివాస రావు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది.

డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు గోపీచంద్, మూర్తి, లోకనాధ రెడ్డి, జగదీశ్వర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page