SAKSHITHA NEWS

బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేడ్ గా చేయడం చారిత్రాత్మక తప్పిదం అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని దళిత జాతికి క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకుల కామెంట్స్…

బాపట్ల నియోజకవర్గంలో దళితుల ఓట్లతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోన రఘుపతి నేడు పదవి అహంకారంతో ఆ దళితులనే అవమానించేటట్టు మాట్లాడటం సిగ్గుచేటు.

రాజ్యాంగబద్ధంగా బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేడ్ గా చేయడం మీకు బాధగా ఉందా?, ఇదేనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద మీకున్న గౌరవం.

దళితులకు పోటీ చేసే అర్హత లేదా?, వారు రాజకీయంగా ఎదగడం మీకు కంటికింపుగా ఉందా అని ప్రశ్నించారు.

రాబోయే రోజుల్లో ఆ దళితులే మిమ్మల్ని రాజకీయ సమాధి చేసి మీ అహంకారాన్ని తుదిముట్టిస్తారని గుర్తు పెట్టుకో కోన.

దళితుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన కోన రఘుపతి వెంటనే దళితులకు క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు..


SAKSHITHA NEWS