సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : గాజులరామరం డివిజన్ సర్వే నెంబర్ 342,329 లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా అధికారులు అలసత్వం వహించడం వల్ల కబ్జాదారులు ప్రజలకు మీ స్థలం కు ఏమికాదు, అధికారులు కూల్చివెయ్యారు అని మాయమాటలు చెప్పి ప్రజల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేసి ఇండ్లను కట్టుతుంటే రెవెన్యూ అధికారులు పునాదులు కట్టేటపుడే కూల్చివేసి కబ్జాదారులను కటకటాల్లోకి వేసి ఉంటే నిన్న జరిగిన సంఘటనలో జంగపురి లాంటి నిరుపేద చనిపోయే వాడు కాదని విమర్శించారు.
ఒక వ్యక్తి మరణించాడు కాబట్టి తెలిసిందని కానీ తెలియకుండా అనేక అరాచకాలు జరుగుతున్నాయని , అక్కడి ప్రజలు బహిరంగంగా చెప్పలేక పోతున్నారని వాపోయారు. ఇలాగే కొనసాగితే గాజులరామరం అరాచకాలకు అడ్డాగా మారి శాంతి భద్రతల సమస్యలకు నిలయంగా మారుతుందేమో అని భయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి ముందుగా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని మోసపోయిన బాధితులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ అధికారుల పై యాదిరెడ్డి బండ వాసులు దాడి చెయ్యడం హేయనియమని నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించాలని ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గకుండా పనిచెయ్యాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.