సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రూ.(181 లక్షలు) ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక (కైలాస వనం) ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు , దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ స్మశాన వాటిక ను ప్రారంభించుకోవడం జరిగినది అని ,ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,
స్మశాన వాటికలలో అన్ని రకాల సకల సదుపాయాలతో ,అన్ని హంగులతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దామని, ఈ స్మశాన వాటికలో అంత్యక్రియల ఫ్లాట్ ఫారం, అడ్మినిస్ట్రేషన్ భవనం ,అంతర్గత రోడ్లు ,టాయిలెట్లు ,వాటర్ ఫౌంటైన్,స్నానాల గదులు , మనిషి జీవిత చరిత్ర సైకిల్ ( మనిషి పుట్టుక నుండి మరణించే వరకు తెలిపే జీవిత చక్రం ను చిత్రాల తో కూడిన గోడను మరియు సమాశం వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించే విధంగా మొక్కలు నాటడం జరిగినది అని ,పర్యావరణ హితం తో నిర్మించడం జరిగినది అని, ప్రజలకు నేటి నుండి అందుబాటులోకి తీసుకురావడం జరిగినది అని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు