ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశ పార్టీ: ప్రత్తిపాటి

Spread the love

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న వైకాపా కుయుక్తులపై అప్రమత్తత, సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతునే జగన్ కుట్రలను ప్రతిఒక్కరు జాగ్రత్తగా గమనించాలని కోరారు. దువా చదివి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించేందుకు ముస్లింల ఆశీస్సులు అందించాలని కోరారు.

నిజానికి ఎన్‌ఆర్సీ, సీఏఏ, ట్రిపుల్ తలాక్‌, కశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌పై లోక్‌సభ, రాజ్యసభలో బలపరిచింది వైసీపీనే అని మండిపడ్డారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేసిన ఆయన కొందరు స్వార్థంకోసం ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజైనా ముస్లిం మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి అందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు ప్రత్తిపాటి. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకబడ్జెట్, ఏటా రంజాన్‌ తోఫా ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో హజ్ హౌస్‌తో పాటు రూ.25 కోట్లతో కడపలోనూ హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. తెలుగుదేశంతోనే షాదీఖానాలు వచ్చాయన్న ప్రత్తిపాటి గతంలో దుల్హన్ పథకాన్నీ వైకాపా నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మసీదుల ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అనే అన్నారు ప్రత్తిపాటి. మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికలకు రూ.50 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసి కాపాడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజుకీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు, తెలుగుదేశం అంటే అంత గౌరవం అన్నారు ప్రత్తిపాటి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నమ్మకాన్ని కదల్చలేరని కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం సోదరులకు మరింత సంక్షేమాన్ని అందించి తీరతామన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page