–జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ముదిగొండ తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేసి, ధరణి, ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తుల క్షేత్ర పరిశీలన పారదర్శకంగా చేయాలన్నారు. ఆమోదయోగ్యంగా ఉన్న ప్రతి దరఖాస్తును ఆమోదించి, న్యాయం చేయాలన్నారు. తిరస్కరణ కు గురయిన దరఖాస్తు కు తగు కారణం పొందుపర్చాలన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ద్వారా అర్హులైన వారందరూ ప్రయోజనం పొందేలా, అన్ని ఎంపిడివో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవాకేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకోలేక పోయిన అర్హులైన వారితో పాటు, దరఖాస్తులో సరైన వివరాలు నమోదు చేయని వారికోసం ప్రజాపాలన కేంద్రాలని, పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు పనిచేస్తాయన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా ముదిగొండ తహసీల్దార్ వై. రామారావు, సిబ్బంది తదితరులు ఉన్నారు.