అధికారులు అప్రమత్తమై ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
వరద నీరు వెళ్ళడానికి ఉన్న కాలువలు తెరిచి ఉండటం వల్ల అనేక మంది ప్రాణాలు పోతున్నా మునిసిపల్ అధికారులు ఇంకా అలసత్వం విడినట్లు కనిపిస్తాలేదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పత్రిక ప్రకటనను విడుదల చేసారు.
గత జులై నెలలో కురిసిన వర్షాలకు గాజులరామరం డివిజన్ , రావినారాయన రెడ్డి నగర్లో దెబ్బతిన్న రోడ్లు,క్వారీలు కబ్జాదారులు పూడ్చివేయడం వల్ల ప్రవహిస్తున్న రోడ్డుపై నీరు నెల రోజులుగా ప్రవహిస్తుండటం వల్ల రోడ్డు పై నాచు రావడంతో ప్రజలు జారీ పడిపోయే ప్రమాదం ఉందని గత నెల రోజుల క్రితం స్థానిక మునిసిపల్ అధికారులు పట్టించుకోలేదని,ఒకవేళ ఎవరైనా జారిపడితే పక్కనే ఉన్న నాలలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కావున ఇప్పటికైనా గాజులరామరం మునిసిపల్ అధికారులు ఇంకో ప్రాణం పోకముందే నాలను కప్పి,రోడ్డుకు మరమ్మత్తు చెయ్యాలని డిమాండ్ చేశారు.