ఆనందంతో MLA మెచ్చా నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు

Spread the love

ములకలపల్లి

అభివృద్ధికి ఆనందబాష్పాలు

ఒకొక్క సమస్యకు పరిష్కారం లభిస్తున్న తరుణంలో ఆనందంతో MLA మెచ్చా నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు

MLA మెచ్చా నాగేశ్వరరావు చొరవతో మారుమూల గ్రామాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ది

రెగులకుంట గ్రామానికి 1కోటి 58లక్షలతో BT రోడ్డు

అశ్వారావుపేట(నియోజకవర్గం)లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆలోచనతో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ముందుకు సాగుతున్నారు.నియోజకవర్గం ఏర్పడి ఎండ్లు గడిచిన అభివృద్ది అనేది శూన్యంగా ఉండేది. MLA మెచ్చా నాగేశ్వరరావు గారు గెలిచాక నియోజకవర్గంలో అనేక మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు..అందులో భాగంగా ఈరోజు ములకలపల్లి(మండలం), రెగులకుంట గ్రామంలో MLA మెచ్చా నాగేశ్వరరావు గారు అధికారులతో కలిసి పర్యటించి ప్రత్యేకంగా గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అక్కడే ఉన్న సంబంధిత శాక అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.అలాగే అదే గ్రామంలో కొండ్రు ప్రసాద్ తెలియని జబ్బుతో బాధ పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే గారికి తేలుపడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి 15000 రు. ఆర్థిక సహాయం అందించారు.పెన్షన్ ఏర్పాటు చేస్తానని వారికి తెలిపారు.ఇదే క్రమంలో ఒకొక్క సమస్య పరిష్కారం అవుతూ గ్రామ రూపు రేకలు మారుతున్న సందర్భంగా గ్రామంలోని ఒక మహిళ ఆనందబాష్పాలతో ఎమ్మెల్యే గారి వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం ములకలపల్లి మండల కేంద్రంలోని కేసీఆర్ కలని(డబుల్ బెడ్ రూం ఇండ్ల)వద్ద అక్కడ నివాసం ఉండే వారితో సమావేశమైనారు ముందుగా మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఇండ్లు మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు.(రోడ్డు కావాలని,బృహత్ ప్రకృతి వనం నుంచి వచ్చే వరద వల్ల ఇబ్బందిగా ఉందని,ఇండ్ల కరెంట్ మీటర్ పేర్లు మార్చడం మరియు డ్రైనేజ్ ఏర్పాటు గురించి సమస్యలు తెలిపారు ..సంబంధిత శాఖ అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు mla గారు).
ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 ఎండ్లు పోరాడి మనకోసం తెలంగాణ రాష్ట్రం సాధించారని.కోట్లాది సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనని.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని విధాలుగా మన నియోజకవర్గానికి అందగా ఉన్నారని.సార్ మాకు అది సమస్య ఉంది అన్న వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని.ఈరోజు ముఖ్యమంత్రి గారి సహకారంతోనే మన నియోజకవర్గంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది చేయడం జరిగిందినీ.అందులో బాగంగా రెగులకుంట గ్రామానికి 1కోటి 58లక్షలతో BT రోడ్డు మంజూరు చేయించడం జరిగిందనీ సుమారు 10లక్షల.రుతో సీసీ రోడ్లు పొయ్యడం జరిగిందనీ.37 పోడు భూమి పట్టాలు మంజూరు చేయించడం జరిగిందనీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని.ఎలాంటి సమస్య ఉన్న వెంటనే తనకు తెలియజేయాలని తద్వారా వెంటనే పరిష్కరించడం చేస్తనాని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,MRO,MPDO,MPO,PR,ITDA,RWS,ఎలక్ట్రికల్ ఇంజనీర్ లు,మండల నాయకులు,వార్డ్ మెంబర్ లు,కార్యకర్తలు, అభిమానులు,పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page