ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు
బాపట్ల జిల్లా ఏర్పడి ఒక వసంతం పూర్తి చేసుకొని రెండవ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బాపట్ల ప్రజలకు, అధికారులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు గా రాష్ట్రాన్ని విభజించి అధికారులను మరియు నాయకులను ప్రజలకు చేరువ చేసి ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ అభివృద్ధి పదం లో నడిపిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ని బాపట్ల జిల్లా లోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించాలి అని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మంచి పని చేసినప్పుడు ఆ మంచి పని చేసిన నాయకులను అభినందించినప్పుడే హుందాతనమైన రాజకీయాలు చేస్తున్నట్లు ప్రజలు గమనిస్తారు అని తెలియ జేశారు. బాపట్ల జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు చిన్న జిల్లాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.
బాపట్ల ను జిల్లా గా చేసినముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS