హిందూ ఉత్సవ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

Spread the love

Thank you to everyone who contributed to the Hindu Utsav Committee

హిందూ ఉత్సవ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
డీఎస్పీ సహకారంతోనే శాంతి భద్రత పరిరక్షణ
వినాయక ఉత్సవ, నిమజ్జనోత్సవాలను ఘనంగా జరుపుకున్నాం
నిమజ్జనానికి సహకరించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
…. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు గౌడ్

హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ, నిమజ్జనోత్సవానికి సహకరించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ పేర్కొన్నారు. యాలాల మండలం కోకట్ గ్రామంలో హిందూ ఉత్సవ కమిటీ మరియు కోకట్ గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు గణేష్ నిమజ్జనంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు డి.ఎస్.పి శేఖర్ గౌడ్, హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులతో కలిసి జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ గ్రామ ప్రజా ప్రతినిధులు, యువకులను సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ డిఎస్పి శేఖర్ గౌడ్ సహాయ సహకారాలతో శాంతి భద్రతల పరిరక్షణ సంపూర్ణంగా జరిగిందన్నారు. నిమజ్జనానికి సహకరించిన పోలీస్ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు, యువకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం డిఎస్పి శేఖర్ గౌడ్ ను, సీఐ రాంబాబు, ఎస్ఐ అరవింద్, కోకట్ గ్రామ ప్రజాప్రతినిధులను, యువకులను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హంసమ్మ , గ్రామ టిఆర్ఎస్ నాయకులు శంకర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page