SAKSHITHA NEWS

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

……

సాక్షిత : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
పటాన్చెరులో ఘనంగా శ్రీ శివ పంచాయతన, హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు
రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో జీర్ణోదరణ
భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు

పటాన్చెరు

పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధితోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేయడం అభినందనీయమని రాష్ట్ర. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

పటాన్చెరు పట్టణంలోని అత్యంత పురాతన శ్రీ మాణిక్ ప్రభు దేవాలయంలో చేపట్టిన జీర్ణోదారణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ శివ పంచాయతన హనుమ నవగ్రహ బొడ్రాయి మాణిక్య ప్రభు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పడదు పటాన్చెరువు పట్టణంలో అత్యంత పురాతనమైన మాణిక్ ప్రభు దేవాలయాన్ని రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో జీర్ణోదరణ చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీఎస్పీ భీమ్ రెడ్డి, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS