ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంకు చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆలయాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు గౌడ్, భిక్షపతి గౌడ్, లింగం గౌడ్, నర్సింహా గౌడ్, మహేష్, శ్రీను, జహంగీర్, శ్రీధర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page