SAKSHITHA NEWS

డాక్టర్ B.R.అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబేద్కర్ మహాసయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ S.C. సెల్ నేతల ఆధ్వర్యంలో ముందుగా పార్టీ కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.N.R.T సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, జోహార్ అంబేద్కర్ నినాదాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, పలువురు నేతలు కొబ్బరి కాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన స్వాతంత్ర్యం అంబేద్కర్ రాజ్యాంగంతో సాధ్య పడిందని తెలిపారు. అలాగే ఇటీవల వరకూ ఈ రాష్ట్రంలో అమలైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు తిరస్కరించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచే దిశగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   హయాంలో అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగి అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.

SAKSHITHA NEWS