అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …
సాక్షిత : నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న కల్యాణ లక్ష్మి చెక్కులకు నేడు మోక్షం…..*
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద చేతుల మీదుగా 41 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ…
125-గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై 41 మంది లబ్ధిదారులకు సుమారు 41 లక్షల పైచిలుకు రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఆడపిల్ల పుడితే బరువుగా భావించే తల్లిదండ్రులకు ఎంతో ఊరటనిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా నాడు బిఆర్ఎస్ అధినేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో బృహత్తర పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పుట్టినింటనే కాదు… మెట్టినింట కూడా గౌరవప్రదమైన జీవితాన్ని అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, తహసిల్దార్ అబ్దుల్ రెహమాన్ ఖాన్, ఆర్ ఐ రేణుక, పాక్స్ డైరెక్టర్ పరీశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, టిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ యువజన అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, స్థానిక నాయకులు చిన్న చౌదరి, బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP