SAKSHITHA NEWS

దాదాపు 27 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసాం – ఎమ్మెల్యే చిరుమర్తి

— సమైక్యంగా కృషి చేస్తేనే అభివృద్ధి – అదనపు కలెక్టర్ కుస్బు గుప్తా

— అందరి సహకారంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి – చైర్మన్ వెంకట్ రెడ్డి

— పట్టణ ప్రగతి దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్

……

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో పట్టణ ప్రగతి దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ అగ్రభాగాన నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పట్టణంలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి రెండు కోట్లు, పట్టణ పరిధిలో శివనేనిగూడెం, వెంకటాపురం లలో వైకుంఠదామాల నిర్మాణానికి 1.90 కోట్లు, సిసి రోడ్లు, డ్రయిన్స్ నిర్మాణానికి 10 లక్షలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.1636 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో ప్రతీ గ్రామం, ప్రతీ పట్టణం ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నాయి.

యువ నాయకుడు మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ విజన్ తో పట్టణాల రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, అందరూ కలిసి సమైక్యంగా కృషి చేసి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కేటాయించిన నిధులతో అన్ని మౌలిక వసతులను పూర్తి చేయలని అన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసామని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు వంటి విషయాల్లో రాజీ పడకుండా అభివృద్ధి చేస్తున్నామని అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు, మానవహారం నిర్వహించారు. అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు.

మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మున్సిపల్ కమిషనర్ ముందడి రామ దుర్గారెడ్డి, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారిణి జిబి శైలజ, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, సిలివేరు మౌనిక శేఖర్ పందిరి గీతా రమేష్, జిట్ట పద్మ బొందయ్య, కో ఆప్షన్ సభ్యులు తాటి మాధవరెడ్డి, జమీరుద్దీన్ పద్మ యాదయ్య,
మేనేజర్ నుజహాత్ పాతిమ, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య కార్యదర్శి జిట్టా చంద్రకాంత్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, యువజన విభాగం అధ్యక్షుడు చిత్రగంటి ప్రవీణ్, గ్రంథాలయ చైర్మన్ దాసరి నరసింహ, పోలేపల్లి సత్యనారాయణ, కోనేటి ఎల్లయ్య, జగిని బిక్షం రెడ్డి, జయారపు శివప్రసాద్, రంగా వెంకన్న,షీలా సత్యనారాయణ, ముబీన్, గోలి భాస్కర్, సంత్ సింగ్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS