SAKSHITHA NEWS

Telangana Private Employees Association 2023 Diary Calendar unveiled Minister Harish Rao

తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 2023 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సాక్షిత ; సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం యొక్క నూతన సంవత్సర డైరీని మరియు క్యాలెండర్ ను హైదరాబాదులోని మంత్రి నివాసం హలో ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు మరియు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు . ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ సంఘం ఆనాడు ఉద్యమంలో మరియు ఈనాడు రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత కూడా ఈ సంఘం వివిధ రాష్ట్రాల్లో శాఖలను నిర్మించుకోవడం శుభదాయమని అభినందనలు తెలిపారు నిరంతరం ఈ సంఘ సభ్యులకు ప్రవేటు ఉద్యోగులకు కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు కోల శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామినేని ఉప్పల్ రావు, అసోసియేట్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇంచార్జ్ మర్రపు గంగాధర్ రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు మారపల్లి వెంకట్ కార్యదర్శులు సంపత్, శివప్రసాద్ యాదవ్ , సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్ కోశాధికారి రవీంద్ర చారి భవనిర్మాణ విభాగం ఇన్చార్జి గంధాల శ్రీనివాస చారి, సాంస్కృతిక విభాగం విభాగం ఇంచార్జ్ డప్పు స్వామి, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రావణి రెడ్డి ప్రధాన కార్యదర్శి శోభ మంజుల రాణి ఉపాధ్యక్షురాలు పుష్ప మన్యం , గుంటి మంజుల , కవిత రెడ్డి కార్యదర్శులు వైశాలి, జాయ్ , శాంతి , హరిని , జయ, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.