SAKSHITHA NEWS

Telangana National Unity Day Celebration at Kompally

కొంపల్లిలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే…


సాక్షిత : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆశా వర్కర్లకు యూనిఫాంలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్ మరియు అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.