యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

Spread the love

నిరంతరం విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఎమ్మెల్యే చిరుమర్తి,జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి
రామన్నపేట సాక్షిత

యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవత‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భనంగా విధ్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవం స్థానిక మల్లిఖార్జున గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్‌ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014కు పూర్వం నిత్య ఉండేవని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో కరెంట్‌ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నారని అన్నారు. నేడు యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో చీకట్లు మాయం అయ్యాయని, ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్ర‌మే ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో ఆ ఉత్పత్తి 18,567 మెగావాట్లకు చేరుకుంద‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి ఇది నిదర్శనమన్నారు. విద్యుత్ శాఖ డిఈ సామల రవిప్రసాద్, ఏడీఈలు సీహెచ్. నరేష్ కుమార్, మట్ట శ్రీకాంత్, ఏఈ జే. నర్సింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీలు కన్నెబోయిన జ్యోతి బలరాం, మున్సిపల్ చైర్మన్ లు కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, రాచకొండ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ పెరుమల్ల శేఖర్, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి, కొప్పుల ప్రదీప్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు,
సింగల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి, చిట్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కమిషనర్ రామదుర్గా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి, సర్పంచ్ లు ఎడ్ల మహేందర్ రెడ్డి, ఎంపిటిసి తిమ్మాపురం మహేందర్ రెడ్డి,గుత్తా నర్సిరెడ్డి, రేఖ యాదయ్యా,అప్పం లక్ష్మి నర్సు, నాయకులు పోతరాజు సాయి, ఎండీ అమెర్, మీర్జా ఆశ్లం బెగ్,ఇనాయతుల్ల బెగ్, మల్లేశం, జయారపు శివ, దాసరి నరసింహ, సిలివేరు శేఖర్, జీట్ట చంద్రకాంత్, శుకుర్, జగిని బిక్షం రెడ్డి, కోనేటి ఎల్లయ్య, జిట్ట బొందయ్య,
తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page