SAKSHITHA NEWS

కరీంనగర్‌ జిల్లా:
బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

కనుమరుగైనా కులవృత్తులు కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకుంటున్నారని, తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకని తెలిపారు.

దేశం వెనుకబాటుకు కారణం కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. ఇన్నేండ్ల పాలనలో కాంగ్రెస్‌ ఒరగబెట్టిందేమీ లేదనన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలో.. నిరంతర విద్యుత్ అందిస్తున్న బీఆర్‌ఎస్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

ఎన్నికల సయయంలో వచ్చి మాయ మాటలు చెప్పే పార్టీల మాటలు నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS