Telangana Former Serpanchs Welfare Association
కరీంనగర్ జిల్లావీణవంక మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో *సమావేశాన్ని
ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బోర్డు దేవయ్య అడ్వకేట్ హాజరై తెలంగాణ మాజీ సర్పంచుల సమస్యలపై 2007ను సంస్థను స్థాపించడం జరిగిందని ఇప్పటివరకు 10 జిల్లాలను తెలంగాణ మాజీ సర్పంచుల స్థితిగతులను తెలుసుకోవడం జరిగిందని 2018 ఎలక్షన్లో మాజీ సర్పంచుల యొక్క సమస్యలను అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టాలని నివేగా అందించడం జరిగిందని అప్పటి ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ మన సమస్యను పట్టించుకోలేదని తెలిపారు మనమందరం మన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ సర్పంచ్ల డిమాండ్ మాజీ సర్పంచ్ పదివేల రూపాయల పింఛన్ రూపంలో అందించాలని, హెల్త్ కార్డు, బస్పాసులు, నిరుపేద మాజీ సర్పంచులకు డబల్ బెడ్ రూమ్, తాజా మాజీ సర్పంచులు మృతి చెందినట్టు అయితే ఆ మండలంలోని అధికారుల లాంచనాలతో వారి అంత్యక్రియలు జరిపించి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళ మాజీ సర్పంచుల రాష్ట్ర అధ్యక్షురాలు మధువాణి, జిల్లా అధ్యక్షుడు పుప్పాల రఘు, మండల అధ్యక్షుడు జునుజుల జనార్దన్ రెడ్డి, మండలంలోని మాజీ సర్పంచులు గంగాడి తిరుపతిరెడ్డి, చిన్నాల ఐలయ్య, దాసరపు ప్రభాకర్, కర్ర భగవాన్ రెడ్డి, బోదాస్ రాయమల్లు, నల్లగొండ రమేష్ గౌడ్, అడిగోప్పల సత్యనారాయణ, మోరే సారయ్య, తిరుపతి, మధు తదితరులు పాల్గొన్నారు