మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు?
హైదరాబాద్:
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు.వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది..
రూ.1400 కోట్లు స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికా రులు గుర్తించారు. వస్తు వులు సరఫరా చేయక పోయిన చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది.
ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి ఐటీసీని క్లయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం.. ప్రసాద్ లకు సీఐడీ నోటీసులు పంపించింది.
త్వరలోనే అధికారులను విచారించి స్టేట్ మెంట్ ను సీఐడీ అధికారులకు పంపించనున్నారు..