SAKSHITHA NEWS

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన OUJAC నేత & జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్.

మతతత్వ బిజెపి పార్టీ విధానాల వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత బడుగు బలహీనవర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాలు అందరూ మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, పార్టీకి అండగా నిలబడి రాహుల్ గాంధీ నాయకత్వన మతతత్వ శక్తుల్ని తరిమికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ మాట్లాడుతూ… భారతదేశానికి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ… కాంగ్రెస్ పార్టీ విదానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని… మరియు తన చేరికకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ టీపీసీసీ కార్యదర్శి మాదు సత్యం గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Image 2024 04 25 at 4.11.31 PM

SAKSHITHA NEWS