గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల
ప్రకాశం జిల్లా,కోమరోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ బూత్ ఇంచార్జ్ టీడీపీ జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ కుటుంబానికి వివారించాలని, టీడీపీ జనసేనల ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను తెలియచేయాలని ప్రతీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త గ్రామస్థాయిలో కస్టపడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం కృషి చేయాలన్నారు.
*ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, టీడీపీ సర్పంచులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు