అనంతపురం జిల్లా:
కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ శ్రీనివాసులు ఇంటిని ఉదయం పోలీసులు చుట్టుముట్టారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా, పోలీసుల వైఖరి ఖండిస్తూ రాయదుర్గం స్టేషన్ ముట్టడికి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం వెళ్లకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా కాల్వ ఇంటి వద్దకు చేరుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయదుర్గం వెళ్లి తీరుతానని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేయగా.. అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు…