SAKSHITHA NEWS

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం.

టిడిపి జెండా ఎగుర వేసిన మండల అధ్యక్షులు.. మెట్టు శ్రీనివాస్ రెడ్డి.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం ను మండల అధ్యక్షులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మండల టిడిపి అధ్యక్షులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి జెండా ఎగుర వేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు..


SAKSHITHA NEWS