SAKSHITHA NEWS


Taking the initiative to install CC cameras is a great thing

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ (ఎమ్మెల్యే (CDP FUNDS ) మరియు కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రూ 3,70,000/- మూడు లక్షల డెబ్భై వేల రూపాయల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ ,శ్రీమతి రోజాదేవి రంగరావు , CI సైదులు , SI శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు తులసి నగర్ కాలనీ వాసులు ముందుకు రావడం చాలా అభినందనీయం అని ,స్ఫూర్తిదాయకం అని, ఇతర బస్తీ ,కాలనీ వాసులకు ఆదర్శముగా నిలిచారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు,అవసరమైతే అదనపు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి నా వంతు ఆర్థిక సహాయం చేస్తానని, దూర దృష్టి తో బస్తీలలో కూడా భద్రత, ప్రజల రక్షణ ధ్యేయంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

సీసీ కెమెరా ల ఏర్పాటు కు చొరవ తీసుకోవడం చాల గొప్ప విషయం అని ,శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని ,సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారం తో అవగాహన కలిపిస్తున్నారని ,ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసుల తో సమానమని, సీసీ కెమెరాల వలన కేస్ ల పరిష్కారం సులువు అవుతుంది అని, నేర శోధన ,నేర నివారణ కు ఎంతో తోడ్పడతాయి అని ,కావున అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు , సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగినది అని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు .

మహిళల,ప్రజల రక్షణకు,దొంగతనాలు అరికట్టడానికి సి.సి.కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,24 గంటల పాటు నిరంతరం పనిచేసే నిఘా నేత్రలను ప్రతి కాలనీ, బస్తీలో ఏర్పాటు చేసుకోవాలి అని ,.. ప్రతి కాలనీలో,బస్తీలో ఇలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంవలన దొంగతనాలు,నేరాలు జరిగినపుడు పోలీసులకు నేరస్తులను గుర్తించడంలో మరియు కీలక సమయం లో సాక్ష్యంగా ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,కాలనీ లో ప్లాస్టిక్ నిషేధించాలని, బెస్ట్ కాలనీ అవార్డ్ వచ్చేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

తులసి నగర్ కాలనీ లో మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని,రోడ్లు ,డ్రైనేజి వంటి సమస్యలని పరిష్కరిస్తానని, కాలనీ లలో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం కలిపిస్తామని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కాలనీ సంక్షేమం అభివృద్దే ముఖ్య ఉద్దేశ్యం తో ముందుకువెళ్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, మోజేశ్ తులసి నగర్ కాలనీ వాసులు రామ కృష్ణ , చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ ,సుకుమార్, ప్రశాంత్, నరేష్, సత్యనారాయణ, రాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS