జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టండి.

Spread the love

వేగవంతంగా అప్రోచ్ కెనాల్ పనుల పూర్తి త్రాగునీరు సరఫరా.
ఇంజనీర్ల కు దిశానిర్దేశం: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నీటి ఎద్దడిని గుర్తించి తగు చర్యలకై నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. త్రాగునీరు అయ్యే పైపులు ఎవరైనా పగలకొట్టడం జరిగితే పరిశీలన చేసి అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అత్యవసర గ్రామాల్లో ట్యాంకర్స్ ద్వారా త్రాగు నీటి సరఫరా చేయాలని ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్ల ను ఆదేశించారు. గ్రామాల్లో చేతి పంపులలో గల మట్టి, మరమ్మతులు అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టాలని సూచించారు. జి.పి. లు, మున్సిలల్ వార్డులలో ఆయా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఫోటోలు పెట్టాలని సూచించారు.

పాలేరులో ఇంటెక్ వెల్ కి నీరు అందక పోవడం తో అప్రోచ్ కెనాల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అప్రోచ్ కాలువ పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. వేసవి దృష్ట్యా సంబంధిత ప్రాంత ప్రజలకు త్వరితగతిన త్రాగునీరు అందించాలని సూచించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ఇప్పటికే పాలేరు రిజర్వాయర్ లో నీటి నిలువలు తగ్గడం తో ఇంటెక్ వెల్ కి నీరు అందకపోవడం వలన అప్రోచ్ కెనాల్ కి నీరు అందక గతంలో వర్షపు వరద నీరు, బురద మట్టి తో పూడి పోవడంతో అట్టి పనులను మిషన్ లతో వేగవంతంగా చేపట్టడం జరుగుతుందని శనివారం నాటికి త్రాగు నీరు సరఫరా చేస్తామని తెలిపారు.
సూర్యాపేట నియోజక వర్గంలో ఆత్మకూరు (ఎస్ ), చివ్వేంల, సూర్యాపేట అలాగే కోదాడ నియోజక వర్గంలోని మోతె , తుంగతుర్తి నియోజక వర్గంలో జాజిరెడ్డి గూడెం, మద్దిరాల, నాగారం, నూతనకల్, తుంగతుర్తి అలాగే సూర్యాపేట మున్సిపాలిటీ లో 7 వార్డులలో మొత్తం 169 గ్రామ పంచాయతీలు అలాగే సూర్యాపేటలో విలీనం అయిన 24 మొత్తం 353 హాబీటెషన్ల కు శనివారం రోజున త్రాగునీటిని అందిచడం జరుగుతుందని ఆయా మండల, మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో నిర్వహించాల్సి ఉన్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సెల్ ఫోన్ లను ఎక్కడ కూడా అనుమతించ వద్దని తహశీల్దార్లు, కమిషనర్లు, ఎంపీ ఓ లు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, RWS అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page