SAKSHITHA NEWS

ఘనంగా కళాశాల విద్యా దినోత్సవం
గ్రూప్ టాపర్స్ కు సన్మానం
డి ఐ ఈ ఓ బైరి శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా అందిస్తున్న ఉచిత ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ ప్రజలు మరియు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకoచ, జనగామ నందు తెలంగాణ కళాశాల విద్యా దినోత్సవంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో వస్తున్న మార్పులకు అనుకూలంగా వివిధ రకాల కోర్సులు మరియు విద్యా విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉచిత అడ్మిషన్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ పొందే అవకాశం మరియు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సర్కారు కాలేజిలో చదివిన వారికి ఇంజనీరింగ్ విద్య ఉచితం అని గమనించగలరు.

కళాశాలలో ఉన్న ఉత్తమ అధ్యాపకుల బోధనను,లైబ్రరీని , ల్యాబ్ లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని రాబోయే కాలంలో మంచి ర్యాంకును సాధించాలని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జాల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వ కళాశాలను పరిరక్షించే బాధ్యత అధ్యాపకులతో పాటు విద్యార్థులు మరియు తల్లితండ్రులదే అని సీనియర్ లెక్చరర్ వేముల శేఖర్ అన్నారు.

కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు విద్యా దినోత్సవం సందర్బంగా కళాశాలలో గల వివిధ గ్రూప్ టాపర్స్ కి శుభాకాంక్షలు తెలిపి గ్రూప్ టాపర్స్ ని షిల్డ్ లతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం పోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, అధ్యాపకులు శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వరుధిని, గణేష్, శ్రీనివాస్, తిరుమల్లేష్, శంకర్, ముక్తాదిర్, ప్రియదర్శిని, రేఖ, లైబ్రరీయన్ రంగన్న, ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్, విష్ణు, పద్మ, రవి మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.


SAKSHITHA NEWS