స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
సాక్షిత : సికింద్రాబాద్ లో సందడిగా జరిగింది. అడ్డగుట్ట లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఉదయం పదిన్నర గంటల నుంచి తుకారాం గేటు నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, వివిధ స్కూల్ ల విద్యార్ధులు, స్థానికులు, పోలీసులతో పద్మారావు గౌడ్ తిరంగా ర్యాలీని చేపట్టారు. అనంతరం అడ్డగుట్ట కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి సాముహిక జాతీయ గీతా లాపన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ పాల్గొని అందరితో కలిసి జాతీయ గీతాన్ని తను కూడా ఆలపించారు. అడ్డగుట్ట ప్రాంతమంతా త్రివర్ణ పతకాల రెపరెపలతో కళకళలాడింది.తి రంగా ఫ్రెండ్స్ యూత్ అసోసిఏషన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్, తుకారం గేటు ఇన్స్పెక్టర్ శ్రీ ఎల్లప్పు, జీ హెచ్ ఎం సీ ప్రాజెక్ట్ అధికారి శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు. అడ్డత్యు అడ్డగుట్ట, తుకారం గేటు, మారేడుపల్లి, లోహియ నగర్, లాలాగూడ ప్రాంతాలకు చెందిన వివిధ స్కూల్ విద్యార్ధులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
Related Posts
ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్-
SAKSHITHA NEWS ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్-16,35,000 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన……….. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి సాక్షిత వనపర్తి ఆపదలో ఉన్నవారికి సీఎం…
మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు..
SAKSHITHA NEWS మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు.. మల్కాజిగిరి రాణిగంజ్ డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రషీద్ తోటి సిబ్బంది ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉండాలని ఉద్దేశంతో, మానవసేవే మాధవసేవ అనే గ్రూప్ ని…