సాక్షిత : SVIMS ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యం లో PINK BUS కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యం ప్రధానాంశం గా భావించి మహిళలకు ఉచిత కాన్సర్ వ్యాధి నిర్ధారణ కై మహిళా వైద్య సిబ్బంది చే నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కతిక యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు శ్రీమతి ఆర్కే రోజా _
నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం T.C. అగ్రహారం గ్రామం లో మంత్రి స్విమ్స్ వారి పింక్ బస్ ద్వారా మహిళలకు ఉచిత కాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు.
SVIMS వారు ఈ పింక్ బస్ మొట్టమొదటి కార్యక్రమాన్ని 19.09.2019 న నగరి నియోజకవర్గం నిండ్ర మండలం లో ఇరుగువాయి గ్రామం నుంచి మొట్టమొదటి సారిగా మన మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు.
తదుపరి ఈ కార్యక్రమం పేదవారికి చాలా బాగా సేవలందించి మహిళలకు ఎంతో మందికి కాన్సర్ ముందస్తు అవగాహనా కల్గించి ప్రాథమిక దశలో ఉన్న వారిని గుర్తించి నయం చేశారు, అలాగే ఇప్పటికే వ్యాధి తో బాధపడుతున్న మహిళలకు తగిన చికిత్స నిమిత్తం సలహాలు, సూచనలు వైద్య సేవలు దిగ్విజయం గా అందించుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు మొత్తం 99 పింక్ బస్ కార్యక్రమాలు పూర్తి చేసి నేడు 100 వ కార్యక్రమం T.C.అగ్రహారం గ్రామం లో చేస్తున్నారు. ఇందులో నగరి నియోజకవర్గం లోనే ఇప్పటివరకు మొత్తం 10చోట్ల ఈ కార్యక్రమం చేశారు (మన మంత్రి కోరిక మేరకు) ఆ ప్రదేశాలు::
ఇరుగువాయి, నిండ్ర, విజయపురం, ముడిపల్లి, నగరిటౌన్, నగరి మునిసిపల్ ఆఫీస్, గోపాలకృష్ణ పురం, పుత్తూరు మార్కెట్ యార్డ్,
పుత్తూరు టౌన్, పుత్తూరు టౌన్.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..
మహిళలకు ఈ కాలం లో సాధారణంగా వచ్చే కాన్సర్ వ్యాధిని అశ్రద్ధ చేయరాదని, ఎందుకంటే సుమారుగా 7000.00 నుంచి 10000.00 వరకు ఖర్చు అయ్యే ఈ రొమ్ము కాన్సర్, గర్భాశయ ముఖద్వారం కాన్సర్, మరియు నోటి కాన్సర్ మొదలైన వైద్య పరీక్షలు ఉచిత గా ఇక్కడ నిర్వహిస్తారని, మహిళల కోసం మహిళా డాక్టర్లు, మహిళా వైద్య సిబ్బంది ద్వారా నిర్వహిస్తారని, ఈ పరీక్షలకు 35 సంవత్సరములు పైబడిన వారు ఎవరైనా చేసుకోవచ్చు అని తెలిపారు. వ్యాధి ప్రారంభ దశ లో ఉన్నవారికి సులువుగా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందని,కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్య భద్రత పొందాలని కోరారు.
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యం గా ఉంటుందని కుటుంబం ఆరోగ్యం గా ఉంటే దేశం కూడా ఆరోగ్యం గా ఉంటుందని, దేశాభివృద్ధి కి మహిళల ఆరోగ్యం చాలా కీలకం అని సందేశాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో మంత్రి తో బాటు మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు SVIMS వైద్య సిబ్బంది పాల్గొన్నారు.