సూది కొండ సాయిబులు కాలనీలో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Spread the love

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూది కొండ సాయిబులు కాలనీలో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులుకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకునే నాధుడు లేకపోయారుఅని వాపోయారు గత 40 సంవత్సరాలుగా ఇక్కడే మేము జీవిస్తున్నామని సరి అయిన డ్రైనేజీ లేక మురుగునీరు వెళ్లే మార్గం లేక రోడ్లు మధ్యలో వెళుతుందని అలాగే కొండవాలు నుండి వచ్చే నీటీ వాలును కబ్జా చేసి కొందరు కట్టుకున్నారని అలాగే కొంత భాగాన్ని మట్టివేసి కప్పి వేశారని నీరు వెళ్లే మార్గం లేక వీది మధ్య నుండి వెళ్తుందని అలాగే సరైన రోడ్డు మార్గం లేక ఆటోలు వాహనాలు వచ్చే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నామని సరైన రోడ్డు మార్గం వేయాలని అలాగే ఎవరికైనా సుస్థి చేస్తే 108 ఫోన్ చేస్తే ఆ రోడ్డు మార్గం బాగు లేదని వెంట రాలేము అని 108 సిబ్బంది చెప్తున్నారు.అనికొండవాలు నీరు వెళ్లే మార్గాన్ని కప్పి వేయడంతో నీటి మార్గాన్ని కాలువల నిర్మాణం చేసి పంపించాలని రోడ్డు మార్గాన్ని నిర్మించాలని కాలనీవాసులు విన్నవించుకున్నారు.

Related Posts

You cannot copy content of this page