లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్టర్ తస్లీమా
మహబూబాబాద్ జిల్లా మానుకోట సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా,ఆమె అనుచరుడు వెంకటేష్
ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడ్డ తస్లీమా నిజస్వరూపం
మహబూబాబాద్:మార్చి 23
లంచం తీసుకుంటూ మహ బూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆమె నిజ స్వరూపం బయటపడింది
ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూ బాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీశ్ తన 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం ఈనెల మొదటి వారంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ను సంప్రదించాడు.
ఆమె సూచన మేరకు కార్యాలయ అవుట్ సోర్సిం గ్ ఉద్యోగి ఆలేటి వెంకటేశ్ ను కలువగా.. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.200 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని వెంకటేశ్ చెప్పాడు.
దీంతో హరీశ్ మళ్లీ సబ్ రిజి స్ట్రార్‌ను కలిశాడు. మొత్తం రూ.19,200 ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. వెంటనే ఆయన వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఒప్పందంలో భాగంగా హరీశ్ శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు డబ్బులు ఇవ్వ బోయాడు. ఆఫీస్‌లో పని చేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్ రూ.19,200 ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వెంకటేశ్ వద్ద రూ.19,200 లతోపాటు అదనంగా 1.72 లక్షలు లభించాయి. అదనపు డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్ తస్లీమాతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
లోన అవినీతి మార్గం.. ప్రజా సేవ పేరుతో ప్రచారం
అవినీతిని మార్గంగా ఎంచుకొని సేవ పేరుతో ప్రచారం పొందుతున్న మహబూ బాబాద్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ తస్లీమా నస్రిన్ నైజం బయటపడింది.
తస్లీమాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా 12 ఏండ్లు అక్కడే విధులు నిర్వహిం చింది. గత ఏడాది బదిలీల్లో భాగంగా మహబూబాబాద్‌కు వచ్చింది.
ప్రభుత్వ సెలవులు వస్తే చాలు మహిళలతో కలిసి నాట్లు వేయడం, పత్తి ఏరడం, మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటుంది. కార్యాలయానికి వచ్చే సమ యంలో ఆటో, బస్సు, ద్విచ క్ర వాహనాల్లో ప్రయాణం చేస్తూ విస్తృత ప్రచారం చేస్తుంది.
ఈమె ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తు లు పంపిణీ చేయడం, ఎవరై నా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం బస్తా, నగదు ఇచ్చి ఫొటోలు దిగడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తుంటుంది.
తస్లీమా మరో కోణంలో రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులతో సెల్ఫీలు దిగుతూ బాబాయ్, తమ్ము డు అంటూ వరుసలు కలిపేస్తుంది. ఏసీబీ అధికా రుల దాడుల్లో తస్లీమా అసలు నైజం బయట పడింది…